Thursday, January 23, 2025

బిసి కులగణనకు ప్రత్యేక కమిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైకోర్టు ఆదేశానుసారం బిసి కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏ ర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రేపటి లోగా అంటే సో మవారమే ఈ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం సిఎం తన నివాసంలో ఈ నె ల 5న రాహుల్‌గాంధీ పర్యటన, కులగణనపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. రాహుల్ గాంధీ పర్యటనకు ముందే హైకోర్టు ఆ దేశాల మేరకు కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బీసీ కులగణనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కులగణనపై తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజా లు లేవని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

హైకో ర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సమాచారం. మరోవైపు రాష్ట్రం లో ఈనెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, వి ద్య, ఉపాధి మరియు కుల సర్వేను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉం డేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని అభిప్రాయపడ్డారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను రేపటిలోగా జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆ దేశించారు. కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేష న్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అం శాలను ప్రభుత్వం పున:సమీక్షించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

రాహుల్ పర్యటనను ప్రతిష్ఠాకరంగా తీసుకున్న టీపీసీసీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల త ర్వాత రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నెల 6 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కాబోతున్న సమగ్ర కులగణన కార్యక్రమానికి ముందు రోజు మంగళవారం సా యంత్రం రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారు. జార్ఖాండ్, మహరాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ బిజిగా ఉం డటంతో ఆయన కేవలం తరువాయి 6లో

గంటసేపు సమయాన్నే తమకు కేటాయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో మీడియాకు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో కులగణన నిర్వహించి ఈ అంశంలో తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని రాహుల్‌గాంధీ పట్టుదలతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో అధికారం చేపట్టడానికి చేరువదాకా వచ్చి కాంగ్రెస్ వైఫల్యం చెందింది. దీంతో వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా రాహుల్‌గాంధీ ఇప్పటి నుంచి ఉత్తరాది రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరవయ్యే దిశగా ‘సంవిధాన్ సమ్మాన్’ పేరిట పర్యటిస్తున్నారు.

‘జిత్నే హిస్సే&ఉత్నీ భాగేదారి’ (జనాభా నిష్పత్తి ప్రకారం&అధికారంలో భాగస్వామ్యం) నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుడుతుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ అంశాన్ని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలలో ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వం కులగణన కార్యక్రమానికి ఈ నెల 6 నుంచి శ్రీకారం చుడుతుండటంతో ఆ ముందు రోజు 5వ తేదిన రాహుల్‌గాంధీని హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బోయిన్‌పల్లిలో గాంధీ ఐడాలజీ సెంటర్‌లో కులగణన కార్యక్రమంపై మేధావివర్గాలతో రాహుల్‌గాంధీ చర్చించనున్నారు.

మేధావులు, ముఖ్యనేతలతో రౌండ్ టెబుల్ సమావేశం
రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో గాంధీభవన్‌లో ఆదివారం టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మేధావి వర్గాలు, పార్టీ ముఖ్యనేతలతో రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి పరిశీలకునిగా కొప్పుల రాజు హాజరయ్యారు. బోయిన్‌పల్లిలో జరుగబోయే సమావేశానికి టిపిసిసి నుంచి ఆహ్వానం అందుకున్న జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ కురపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ భూక్య రౌండ్ టెబుల్ సమావేశానికి హాజరై రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. పార్టీ ముఖ్య నాయకులు ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, కోట నీలిమా, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, రోహిన్‌రెడ్డి, ఫహీమ్ ఖురేషి తదితరులు రాహుల్ గాంధీ పాల్గొనబోయే సమావేశాన్ని విజయవంతం చేయడంపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News