Wednesday, January 22, 2025

అమేథీ నుంచి రాహుల్ పోటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ నేత రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అహయ్ రాయ్ శుక్రవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తధ్యం అన్నారు. యుపిలో ఇతర చోట్లా కాంగ్రెస్ తన పూర్వ వైభవం తిరిగి సంతరించుకుంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రియాంక రాష్ట్రంలో ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చునని, నిర్ణయం ఆమెకే వదిలిపెడుతున్నామని రాయ్ మీడియాతో తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ బిజెపి అభ్యర్థిని స్మృతీ ఇరానీ చేతిలో ఓడారు. ఇప్పుడు పరిస్థితి తారుమారయిందని తెలిపిన యుపి పిసిసి నేత అమేథీ కాంగ్రెస్‌దే. కాంగ్రెస్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ వారణాసిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోటీకి దిగినా మంచిదే అని,

ఆమె విజయానికి పార్టీ శ్రేణులు అన్నీ కలిసి పనిచేస్తాయని తెలిపారు. అమేథీలో రాహుల్ కేంద్ర మంత్రి ఇరానీ మధ్య పోటీ ఉండవచ్చు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి చక్కెర ధరలపై ఎన్నికల దశలో చేసిన తీపి మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. చక్కెర కిలో రూ 13కు అందేలా చేస్తామన్నారు. మరి ప్రజలకు ఇప్పుడు చక్కెర ఏ చేదు ధరకు అందుతుందో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. 2019 లోక్‌సభ ఎన్నికలలోనే వారణాసి నుంచి మోడీకి వ్యతిరేకంగా ప్రియాంక పోటీకి దిగుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇది జరగలేదు. చివరి దశలో అక్కడ అజయ్ రాయ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. రాహుల్ ఇప్పుడు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News