Thursday, January 23, 2025

అప్పీల్ కేసు దాఖలు చేయబోతున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం అప్పీల్ చేయబోతున్నారు. ‘మోడీలంతా దొంగలు’ అని ఓ ఎన్నికల ప్రసంగంలో అన్నందుకు ఆయనను క్రిమినల్ డిఫేమస్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఆ తీర్పుపై ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పీల్ చేయబోతున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెషన్ కోర్టులో ఆయన వినతిని దాఖలు చేసే సందర్భంలో రాహుల్ గాంధీ కోర్టులో ఉండనున్నారు. తనకు పడ్డ రెండేళ్ల జైలు శిక్షను ఆయన సవాలు చేయబోతున్నారని అభిజ్ఞవర్గాలు ఆదివారం తెలిపాయి.

కోర్టుకు వెళ్లేప్పుడు రాహుల్ గాంధీ వెంబడి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉండనున్నారు. ‘మోడీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు 2019 నాటి పరువునష్టం కేసులో మార్చి 23న చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్‌హెచ్. వర్మ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఐపిసి సెక్షన్లు 499, 500 కింద రాహుల్ గాంధీని జడ్జీ దోషిగా తేల్చారు. అయితే 30 రోజుల్లోగా పైకోర్టులో అప్పీల్ చేసుకోడానికి సమయాన్ని కూడా ఇచ్చారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 24 గంటల్లోనే లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని అనర్హుడిగా కూడా ప్రకటించేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News