Friday, November 22, 2024

శిక్షను సవాలు చేస్తూ నేడే రాహుల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

సూరత్: తనపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిద్ధమయినట్లు తెలుస్తోంది.ఈ మేరుకు ఆయన సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో వ్యా జ్యం దాఖలు చేయనున్నట్లు సమాచారం. న్యాయనిపుణులతో కలిసి ఇప్పటికే పిటిషన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. పిటిషన్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూరత్ సెషన్స్ కోర్టుకు రానున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కిరిట్ పాన్‌వాలా చెప్పారు. గాంధీ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఉండారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో తనను దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఆయన తన పిటిషన్‌లో కోరనున్నట్లు సమాచారం. అలాగే సెషన్స్ కోర్టులో తీర్పు వెలువేవరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా అభ్యర్థించనున్నట్లు కూడా సమాచారం. మోడీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదయిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు గత నెల 23న రాహుల్‌కు రెండేళ్లజైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. శిక్షపడిన ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్ వెంటనే అనర్హత వేటు వేసింది. అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో సూరత్ కోర్టు తీర్పుపై న్యాయపరంగా పోరాడాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News