Wednesday, January 1, 2025

హైకోర్టును ఆశ్రయించబోతున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

సూరత్: ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యానం కేసులో శిక్షపడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘స్టే’ కోరుతూ పిటిషన్ వేయగా సూరత్‌లోని కోర్టు తిరస్కరించింది. అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్.పి.మొగేరా దోషిగా నిర్ధారించడంపై ‘స్టే’ కోసం రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. ఒకవేళ అనుమతించితే ఆయన పార్లమెంటు సభ్యుడిగా(ఎంపి) తిరిగి నియమించబడటానికి మార్గం సుగమం అవుతుంది. భారతీయ జనతా పార్టీ(బిజెపి) సూరత్ కోర్టు నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ, ప్రజల విజయంగా అభివర్ణించింది. కాగా చట్టం ప్రకారం ఇంకా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

సెషన్స్ కోర్టు ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కిరీట్ పన్వాలా తెలిపారు. దిగువ కోర్టు మార్చి 23న ఇచ్చిన ఉత్తర్వులపై తాను చేసిన అప్పీల్‌పై విచారణను ప్రారంభించేందుకు సెషన్స్ కోర్టు మే 20వ తేదీని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 3న రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది రెండేళ్ల జైలు శిక్షపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన అప్పీల్‌తో పాటు రెండు దరఖాస్తులను దాఖలు చేశారు. ఒకటి బెయిల్ కోసం, మరొకటి అతని అప్పీల్ పెండింగ్‌లో ఉన్న నేరంపై ‘స్టే’ కోసం.
రాహుల్ గాంధీ దరఖాస్తును కొట్టివేస్తూ, ప్రాతినిధ్యంలోని సెక్షన్ 8(3) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నిరాకరిస్తే ఆయనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని నిరూపించడంలో ఆయన తరఫు న్యాయవాది విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ దాఖలు చేసిన క్రిమినల్ డిఫేమేషన్ కేసులో ఐపిసి సెక్షన్స్ 499, 500 కింద రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించారు. ఆ మరునాడే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీ వినతిని తిరస్కరించేప్పుడు అన్ని విషయాలను పరిశీలించాలని పూర్ణేశ్ మోడీ న్యాయవాది హర్షిల్ తొలియా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News