Monday, December 23, 2024

మరోసారి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ తేదీనుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రె స్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించిం ది. మణిపూర్ నుంచి ఆరంభమై ఈ యాత్ర ముంబై వరకూ 67 రోజుల పాటు జరుగుతుం ది. మార్చి 20న ముగుస్తుంది. 14 రోజుల పా టు రాహుల్ యాత్ర 14 రాష్ట్రాలలో 85 జిల్లాల మీదుగా సాగుతుంది. గతంలో రాహుల్ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తరువాత తిరిగి ప్రజలతో
మమేకం దిశలో ఆయనతో కాంగ్రెస్ తలపెట్టిన విస్తృత కార్యక్రమం ఇదే. తూర్పు భారతం నుంచి పడమర భారతం వరకూ ఈ భారత్ న్యాయ యాత్ర సాగుతుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ను మరింతగా ప్రజల వద్దకు చేర్చేందుకు, పలు ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వారికి న్యాయంపై భరోసా కల్పించేందుకు ఈ యాత్ర తలపెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

న్యాయ యాత్ర బస్సులు, కాలినడకన సాగుతుంది. ఇంఫాల్‌లో జనవరి 14న ఈ యాత్రకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పచ్చజెండా చూపి ప్రారంభిస్తారు. నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , గుజరాత్, మహారాష్టల మీదుగా ఈ పర్యటన సాగుతుంది. మణిపూర్‌లో ఆరంభమయ్యి ఇది ముంబైలో ఆగుతుందని జైరాం రమేష్ వివరించారు. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఎప్రిల్ లేదా మే నెలలో జరిగే వీలుంది. ఈ యాత్ర ఉద్ధేశం గురించి ఆయన విలేకరులకు తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర దశలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారని , ఆర్థిక వివక్షతలు , విభజిత ధోరణులు , నిరంకుశ పోకడలు వంటివాటితో భారతీయ జీవలక్షణం అయిన సామరస్యం, సమంజసవాదం దెబ్బతింటోందని , ప్రత్యేకించి ధనిక పేద వ్యత్యాసాలు అగాధాల స్థాయిని దాటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారని రమేష్ తెలిపారు. ఇప్పుడు ఆయన ఆలోచనల క్రమంలోనే తలపెట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో దేశ ప్రజలందరికి పలు అంశాలలో తగు న్యాయం కోసం నినాదం ప్రసరింపచేస్తారని వివరించారు.

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికి వెలువరించడం కీలక అంశం అని చెప్పారు. ఇది తక్షణ అవసరం దీనిని ఈ యాత్రలో సర్వత్రా ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పలువురు నేతలు రాహుల్ తిరిగి దేశవ్యాప్త తదుపరి పర్యటన చేపట్టాల్సి ఉందని కోరారు. దీనికి అనుగుణంగా ఏకగ్రీవ తీర్మానం కూడా వెలువరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యాత్రకు అంకురార్పణం జరిగిందని పార్టీ సంస్థాగత విషయాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News