Saturday, November 23, 2024

రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Rahul to UP

న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాథ్ సర్కారు అనుమతిని నిరాకరించినప్పటికీ అక్టోబర్ 6న హింసాత్మక ఘటన చోటుచేసుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరికి వెళతానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు.“ఈ రోజు(బుధవారం) పరిస్థితిని అంచనా వేయడానికి, రైతు కుటుంబాలకు మద్దతునివ్వడానికి ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి సందర్శిస్తాను” అని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో తెలిపారు.

లఖీంపూర్ ఖేరిలో అక్టోబర్ 3న నిరసన తెలుపుతున్న రైతుల మీదికి కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కారును నడిపించడంతో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వారిలో నలుగురు రైతులు ఉన్నారు. ప్రస్తుతం లఖీంపూర్ ఖేరిలో 144 సెక్షన్ ఉన్నందున పెద్ద ఎత్తున సమావేశం కావడాన్ని నిషేధించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు.

“ఒకవేళ రాహుల్ గాంధీ లక్నో వస్తే, మేము విమానాశ్రయంలోనే లఖింపుర్ ఖేరి, సీతాపుర్ సందర్శించొద్దని ఆయన్ని కోరుతాము. శాంతిభద్రత కారణాలరీత్యా ఆయన్ని లఖీంపూర్, సీతాపుర్ రాకుండా ఆపాలని జిల్లా మెజిస్ట్రేట్ కోరారు” అని లక్నో పోలీస్ కమిషనర్ తెలిపారు. రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి  ప్రియాంక గాంధీని సిఆర్‌పిసి 151 సెక్షన్ కింద సీతాపుర్‌లో నిర్బంధించి ఉంచారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌కు రావాలనుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News