Sunday, February 23, 2025

మణిపూర్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు. దాదాపు రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రశ్నించినా కేంద్రం ప్రభుత్వం, మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు స్పందించలేదు. మంటల్లో అట్టుడుకుతున్న మణిపూర్‌ను పట్టించుకోకుండా ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విదేశి పర్యటన అనంతరం ప్రధాని మణిపూర్‌ పరిస్థితులపై సమీక్షించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, మణిపూర్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 29, 30వ తేదీల్లో రాహుల్ గాంధీ, మణిపూర్‌లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ పర్యటనలో హింసాత్మక ఘటనలు నెలకొన్న ఇంఫాల్, చురచంద్‌పూర్‌లను రాహుల్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పౌర సమాజ ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

Also Read: అది అక్రమార్కుల గ్రూప్ ఫొటో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News