Monday, January 20, 2025

22న శంకర్‌దేవ జన్మస్థలానికి రాహుల్

- Advertisement -
- Advertisement -

అదే రోజు అయోధ్యలో రామ్ మందిర్‌లో ప్రాణ ప్రతిష్ఠ
జైరామ్ రమేష్ ప్రకటన

ఉత్తర లఖింపూర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం (22న) అస్సాం నాగోన్ జిల్లాలో శ్రీవైఫ్ణవ పండితుడు శ్రీమంత శంకర్‌దేవ జన్మస్థలంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తారని పార్టీ నేత జైరామ్ రమేష్ వెల్లడించారు. అయోధ్యలో రామ్ మందిర్‌లో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం జరిగే రోజు రాహుల్ శ్రీశ్రీ శంకర్‌దేవ జన్మస్థలం బటద్రవ ఠాణ్‌కు వెళతారని రమేష్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాహుల్ వెంట రమేష్ సాగుతున్నారు. యాత్ర అస్సాంలో శనివారం మూడవ రోజు సాగుతోంది.

‘రాహుల్‌జీ, యాత్ర 22న ఎక్కడ ఉండబోతున్నట్లు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 22 ఉదయం రాహుల్‌జీ శ్రీ శ్రీ శంకర్‌దేవ జన్మస్థలం బటద్రవ ఠాణ్‌లో ఉంటారని ప్రతి ఒక్కరికీ చెప్పదలిచాను’ అని రమేష్ లఖింపూర్ జిల్లా గోవింద్‌పూర్‌లో విలేకరుల గోష్ఠిలో తెలిపారు. ‘శంకర్‌దేవ శతాబ్దాల క్రితం జీవించారు. కాని ఆయన జీవితం ఇప్పటికీ కోట్లాది మందికి ఆదర్శప్రాయం’ అని రమేష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News