Thursday, January 9, 2025

రాష్ట్రంలో రాహుల్ పర్యటన తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi to visit Telangana for 2 days

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తేదీలు శనివారం ఖరారయ్యాయి. మే 6,7 తేదీల్లో రాహుల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. సాయంత్రం 6గంటలకు సభకు రానున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల కొనుగోలుతో పాటు అన్నదాతలకు సంబంధించిన ఇతర సమస్యల గురించి సభలో మాట్లాడనున్నట్టు సమాచారం. మే 7న హైదరాబాద్ లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యచరణపై నేతలతో చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News