Monday, December 23, 2024

ఇంటికొచ్చినట్లుంది..జనమే కుటుంబం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ శనివారం రెండురోజుల పర్యటనకు కేరళలోని వాయనాడుకు చేరుకున్నారు. వాయనాడ్ ఎంపిగా లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణతరువాత రాహుల్ తన సొంత నియోజకవర్గ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయనకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. గిరిజనుల బృందాలు ఆయనకు సాంప్రదాయకంగా నృత్య తాళమేళాలతో నాట్యాలతో స్వాగతం పలికారు. తరువాత రాహుల్ గాంధీ అక్కడి సమూహాన్ని ఉద్ధేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ఇక్కడి ప్రజలు తన కుటుంబ సభ్యులని తెలిపారు. తాను తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లుందని తెలిపిన రాహుల్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రానికి మణిపూర్ విషయంపై మాట్లాడే ధైర్యం లేదన్నారు.

మణిపూర్ గురించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ పదేపదే నవ్వడం చమత్కారాలకు దిగడం ఎంతవరకూ భావ్యం అని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రం మండిపోతూ ఉంటే ఆయనజోక్‌లు వేసుకునే దశ ఏర్పడిందన్నారు. మణిపూర్‌లో వేలాది కుటుంబాలు ధ్వంసం చేశారు. పలువురు మహిళపై అత్యాచారాలు జరిగేలా పరిస్థితులను గాలికొదిలేశారు. అక్కడ పలువురు దారుణంగా హత్యకు గురయ్యేలా చేశారు, మరి ఇంతటి దారుణాలు జరిగిన ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు , ఏ విధంగా నవ్వగల్గుతున్నారు? అని రాహుల్ పరోక్షంగా ప్రధానిని ప్రశ్నించారు. అక్కడ భారతమాత దారుణంగా దెబ్బతింది. ఈ తీవ్రస్ధాయి విషయంపై ప్రసంగంలో కేవలం రెండు నిమిషాలే ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇండియా అనే భావనను విస్మరించే ధైర్యం మీకెక్కడిది? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News