Sunday, December 22, 2024

రేపు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్‌ను సందర్శించి కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటన బాధితులను పరామర్శిస్తారని వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం రాహుల్, ప్రియాంక బుధవారం వయనాడ్‌ను సందర్శించవలసి ఉండగా భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా వారు అక్కడకు చేరుకోలేరని అధికారులు తెలియచేశారు. దీంతో వారిద్దరూ తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మేప్పడిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల, సెయింట్ జోసెఫ్ అప్పర్ ప్రైమరీ స్కూలులో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను రాహుల్, ప్రియాంక గురువారం సందర్శిస్తారని వర్గాలు తెలిపాయి. మేప్పడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీని కూడా వారిద్దరూ సందర్శిస్తారని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News