Tuesday, December 3, 2024

వాళ్లకు రిజర్వేషన్లు మోడీ, కెసిఆర్ వద్దన్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రజలు తెలంగాణ కోరుకుంటే దొరల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని, దోపిడీ సొమ్మంతా బిఆర్‌ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు. పసుపు మద్దతు ధర రూ.15 వేలకు పెంచుతామని, బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. ఒబిసికి రిజర్వేషన్లు వద్దని పిఎం మోడీ, సిఎం కెసిఆర్ అంటున్నారని, తెలంగాణలో ఓబిసి కులగణన చేపడుతామని హామీ ఇచ్చారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News