Thursday, January 9, 2025

ప్రభుత్వ కార్యక్రమాన్ని బాబు సాదాసీదాగా నడిపించారు: రఘువీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిరలో గురువారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సిఎం చంద్రబాబు నాయుడు నడిపించడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘువీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రఘువీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం ఆహ్వానించదగినదని కొనియాడారు.

గత పది ఏళ్లుగా మడకశిరలో అనేక సమస్యలు అపరిస్కృతంగా వున్నాయని,  వాటిని త్వరితగతిన పరిష్కరించే శక్తిని దేవుడు చంద్రబాబుకు ఇవ్వాలన్నారు. కేరళలో భారీ వర్షాలు కురవడంతో వరదలలో వందలాది మంది చనిపోవడంతో ఆ రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొందన్నారు. వయనాడ్ లో జలప్రళయం సృష్టించిడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రాణాలు  కోల్పోయిన కుటుంబాలను రాహుల్ పరామర్శించి ఓదార్చారు.  విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా ఉండాలని రాహుల్ పిలుపునివ్వడం గొప్పవిషయమన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News