Monday, December 23, 2024

బస్సులో మహిళలతో రాహుల్ ముచ్చట్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరిరోజు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలు, కళాశాల విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్‌కు తన సమస్యల గురించి వివరించింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

దీనిపై రాహుల్ తాము అధికారం లోకి వస్తే గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతినెలా మహిళలకు రూ. 2000 ఇస్తామనే హామీని గుర్తు చేశారు. అలాగే బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాహుల్ బీఎంటీసి బస్సులో ప్రయాణించిన వీడియోను కాంగ్రెస్ యూత్ విభంగా ఎన్‌ఎస్‌యూఐ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. బెంగళూరు విజన్ గురించి కర్ణాటక మహిళలు ఏమనుకుంటున్నారో రాహుల్ అడిగి తెలుసుకున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News