Sunday, December 29, 2024

రాహుల్ గాంధీ భారత్ ను అస్థిరపరచాలనుకుంటున్నారు: కంగన రనౌత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లోని మండీకి చెందిన బిజెపి ఎంపీ కంగన రనౌత్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తూర్పారబట్టింది. సెబీ-హిండెన్ బర్గ్ వివాదంలో కడిగిపారేసింది. నిష్పక్ష విచారణను ఆమె డిమాండ్ చేశారు. ఆమె తన ‘ఎక్స్‘ పోస్ట్ లో రాహుల్ గాంధీని ‘ప్రమాదకర వ్యక్తి’ అని పేర్కొంది. ‘‘ రాహుల్ గాంధీ చాలా విషపూరిత, వినాశకర మనిషి. అతడి ఎజెండా ఏమిటంటే తాను ప్రధాని కాకపోతే, దేశాన్ని కూడా నాశనం చేయడానికి వెనుకాడడు’’ అంది. హిండెన్ బర్గ్ రిపోర్టును రాహుల్ గాంధీ ఆమోదిస్తున్నాడని పేర్కొంది.హిండెన్ బర్గ్ నివేదిక వెలువడ్డాక రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా మోడీ సర్కారును జవాబులడిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News