Monday, December 23, 2024

రైల్వే కూలీగా రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మాస్ లుక్కులో కనిపించారు. ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు. ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్ స్పందించారు.

గురువారం ఆయనే స్వయంగా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకొంది. భారత్ జోడో యాత్రకు దీనిని కొనసాగింపుగా అభివర్ణించింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ రైల్వే కూలీ వలే సామాన్లు మోస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత జోడో యాత్ర ముగిసిన తర్వాత కూడా రాహుల్ ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. అందుకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News