Monday, January 20, 2025

ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నాం:రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాఃధీ అన్నారు. అయితే సైద్ధాంతిక పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ద్వారా హిందీ హార్ట్‌ల్యాండ్‌పై తన పట్టును బిజెపి మరింతగా బిగించింది. అయితే తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్‌ను గద్ద్దెదించడంలో కాంగ్రెస్ కృతకృత్యమైంది.‘ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము వినమ్రంగా అంగీకరిస్తున్నాం. అయితే సైద్ధాంతిక పోరు కొనసాగుతుంది’ అని ఎక్స్‌లో హిందీలో చేసిన సోస్టులో రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.

‘ప్రజల తెలంగాణ’ చేస్తామన్న హామీని మేము కచ్చితంగా నెరవేరుస్తాం. తీవ్రంగా శ్రమించిన మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ‘ ఇది రాష్ట్రప్రజల, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిఒక్క కార్యకర్త విజయం. తెలంగాణ ప్రజలకు నా హృదయపు లోతుల్లోంచి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల సుఖశాంతులు, ప్రగతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది’ అని ప్రియాంక ఓ ట్వీట్‌లో అన్నారు. ‘మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్రను అప్పగించారు. ప్రజల నిర్ణయాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నాం’ అని కూడా ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News