- Advertisement -
శ్రీనగర్: లాల్‌చౌక్‌లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గట్టి భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటుచేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన ఆయన సోనావర్‌లో 30 నిమిషాల పాటు విశ్రమించారు. ఆ తర్వాత మౌలానా ఆజాద్ రోడ్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం వైపుకు పయనమయ్యారు. స్థానికంగా ‘ఘంటా ఘర్’ అని పిలిచే చోట ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
రాహుల్ గాంధీ వేట ఈ సందర్భంగా ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. ఆయన జెండా ఎగురవేసేప్పుడు లాల్ చౌక్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల రాకపోకలను అనుమతించలేదు. అంతేకాదు దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు, వీక్లీ మార్కెట్‌ను మూసి ఉంచారు.
- Advertisement -