వయనాడ్(కేరళ): తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టిన కాంగెస్ ఎంపి రాహుల్ గాంధీ సోమవారం ఇక్కడి గాంధీ పార్కులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్ముని బోధనలను, ఆయన జీవన విధానాన్ని స్మరించారు. ఈ విగ్రహాన్ని చూసినపుడు మనకు మహాత్మా గాంధీ మాత్రమే గుర్తుకురారని, ఆయన నడచిన మార్గం, జీవన విధానం గుర్తుకు వస్తాయని రాహుల్ అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆయన ఆచరించి చూపారని రాహుల్ చెప్పారు. భారతదేశం పరమత సహనంతో, మహిళల పట్ల గౌరవంతో, లౌకికవాదంతో ఉండాలని మహాత్ముడు చెప్పడమే కాదు ఆచరించి చూపారని ఆయన అన్నారు. సోమవారం ఉదయం కోజిక్కోడ్ చేరుకున్న రాహుల్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సిఎల్‌ఎటి)లో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులతో కలసి భోజనం చేశారు.
'എന്റെ ജീവിതമാണ് എന്റെ സന്ദേശം'
മാനന്തവാടി ഗാന്ധിപാർക്കിൽ ശിൽപ്പി കെ.കെ. ആർ. വേങ്ങര നിർമ്മിച്ച മഹാത്മാ ഗാന്ധിയുടെ ജീവൻ തുടിക്കുന്ന പ്രതിമ അനാച്ഛാദനം ചെയ്തു. pic.twitter.com/l4owO9LP6k
— Rahul Gandhi – Wayanad (@RGWayanadOffice) August 16, 2021