- Advertisement -
న్యూఢిల్లీ: విదేశాలకు కరోనా టీకాల ఎగుమతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు టీకా ఎగుమతిని తప్పుపట్టారు. దేశ ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. కరోనా ఉద్ధృతి దశలో టీకాల కొరత తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. టీకాల ఉత్సవం జరపాలన్న ప్రధాని పిలుపుపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీకా కొరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నా పట్టించుకోవట్లేదని ద్వజమెత్తారు. వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలకు టీకా అందించాలని డిమాండ్ చేశారు. కలిసికట్టుగా కరోనా వైరస్ ను ఓడిద్దామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, దేశంలో ఇప్పటివకే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Rahul Gandhi urges PM Modi to halt vaccine exports
- Advertisement -