Tuesday, November 5, 2024

ఖాళీ చేయండి

- Advertisement -
- Advertisement -

రాహుల్ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసు
అనర్హత వేటుతో అధికారిక బంగ్లాలో
ఉండే అవకాశం లేదన్న కమిటీ

22లోగా అధికారిక నివాసాన్ని వీడండి

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తమ అధికారిక ని వాస బంగ్లాను వచ్చే నెల 22లోగా ఖాళీ చే యాలని నోటీసులు వెలువరించారు. ఈ విష యం సోమవారం అధికార వర్గాల ద్వారా ని ర్ధారణ అయింది. గుజరాత్ సూరత్ జైలు రా హుల్‌కు శిక్ష విధించడం, తరువాత ఆయన ఎంపి సభ్యత్వంపై అనర్హత వేటు పడడం వం టి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆయన బంగ్లా ఖాళీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నోటీసులను లోక్‌సభ హౌసింగ్ కమిటీ పం పించింది. అనర్హతకు గురైన ఏ లోక్‌సభ స భ్యులైనా ఆ తేదీ నుంచి నెలరోజుల్లోపు నివాసం ఖాళీ చేయాలనే నిబంధన ఉందని, ఈ మేరకు రాహుల్‌కు సంబంధిత నోటీసు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఖాళీ చేయడానికి సంబంధిత వ్యక్తి మరింత గడువు కోసం హౌసింగ్ కమిటీకి ద రఖాస్తు చేసుకోవచ్చు. దీనిని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పార్ల మెంట్ సభ్యుడిగా ఇప్పటివరకూ రాహుల్ అనుభవిస్తున్న పలు అలవెన్స్‌లు ఇతర సౌకర్యా లు, పలు విభాగాల సేవలు వెనకకు తీసుకునే విషయం కూడా లోక్‌సభ సెక్రెటేరి యట్ పరిశీలిస్తోంది. 2004లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన తరువాత రాహుల్‌కు తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ బంగ్లా కేటాయించింది. అప్పటి నుంచి ఆయన అధికారిక నివాసంగా ఈ బంగ్లా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ బంగ్లా ఖాళీకి తమకు ఎటు వంటి నోటీసు అందలేదని రాహుల్ బృందం తెలిపింది. ఇవి తమకు అందితే అప్పుడు తదుపరి చర్యలు తాము తీసుకుంటామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News