Sunday, January 19, 2025

పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో కెసిఆర్ చెప్తారా?: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో కెసిఆర్ చెప్తారా? అని అందోల్ నియోజకవర్గం విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. కెసిఆర్ దోపిడీ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. తెలంగాణ ఆదాయమంతటినీ కెసిఆర్ కుటుంబం దోచుకుంటోందన్న రాహుల్.. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కెసిఆర్ కుటుంబం చేతిలోనే ఉందని తెలిపారు. ధరణి పోర్టల్ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. రాత్రి అశోక్ నగర్ లో తెలంగాణ యువతో మాట్లాడానన్నారు. పేపర్ల లీక్ వల్ల ఎంతో నష్టపోయామని యువకులు బాధను వ్యక్తం చేశారని చెప్పారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే అవి రద్దు అయ్యాయని బాధపడ్డారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News