- Advertisement -
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఈనెల 21 నుంచి 22 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ యూనివర్శిటీని సందర్శిస్తారన్నారు. ఆ వర్శిటీ లోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా గురువారం ఎక్స్‌వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతోపాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతోనూ సమావేశమవుతారని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో రాహుల్ మూడ్రోజులు అమెరికాలో పర్యటించారు.
- Advertisement -