Friday, January 10, 2025

నేడు రాహుల్ గుజరాత్ పర్యటన

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను సందర్శించనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ నాయకుడు ఒకరు శుక్రవారం తెలిపారు. రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదం, వడోదరలో బోడు మునక, మోర్బీ వంతెన కూలిపోవడం వంటి దుర్ఘటనలలో మరణించిన వారి కుటుంబాలను కూడా రాహుల్ కలుసుకుంటారు.

లోక్‌సభలో హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇక్కడి గుజరాత్ పిసిసి కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించిన బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడిన నేపథ్యంలో రాహుల్ అహ్మదాబాద్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘర్షణకు సంబంధించి ఇరు పార్టీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా రాహుల్ కలుసుకుంటారని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ విలేకరులకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News