Monday, December 23, 2024

ఈనెల 18 రామప్పకు రాహుల్ గాంధీ రాక

- Advertisement -
- Advertisement -

ములుగు ః ఈనెల 18 వ తేదీన ములుగు జిల్లాలోని రామప్పకు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ రానున్నట్లు ములుగు ఎంఎల్ఎ సీతక్క తెలిపారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో రామప్ప చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వెంకటాపురం మండలం రామాంజపురం మహిళా డిక్లరేషన్ బహిరంగ సభ స్థలానికి బస్సులో చేరుకుంటారు.

50 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. బిఆర్‌ఎస్ మెనిఫెస్టో కాంగ్రెస్ పార్టీతో పోటిపడేలా వేలం పాటల ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధిక ధరలు పెంచి మహిళలను నడ్డి విరిచిన బిఆర్‌ఎశ్ ప్రభుత్వం మోసపూరిత హామిలతో అధికారం చేపట్టాలని చూస్తుందని అన్నారు. ఈనెల 18 న జరగనున్న మహిళా డిక్లరేషన్ భారీ బహిరంగ సభకు ప్రజలంతా స్వచ్చందంగా తరలిరావాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News