Monday, January 20, 2025

ఢిల్లీ మార్కెట్‌లో రాహుల్ వడ్రంగి పనివారితో ముచ్చట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ గురువారం కొద్ది సేపు కార్పెంటర్ అయ్యారు. స్థానిక కీర్తినగర్ ఫర్నిచర్ మార్కెటకు ఆయన ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ వడ్రంగి వృత్తిలో ఉన్న పలువురితో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ జీవితపథంలో వారు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యల గురించి ఆరాతీశారు. అక్కడనే ఉన్న ఫర్నిచర్ తయారీ పనిముట్లను చేతిలోకి తీసుకుని వాటి పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు హర్యానాలో రైతుగా, ఇటీవలే రైల్వే కూలీగా, తరువాత రైలు ప్రయాణికుడిగా అనుభవాలను పంచుకుంటూ వచ్చిన ఈ కాంగ్రెస్ నేత ఇప్పుడు కార్పెంటర్ కావడం జరిగింది. తాను గురువారం ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌కు వెళ్లినట్లు ,

అక్కడ కార్పెంటర్ భయ్యాలతో మాట్లాడినట్లు రాహుల్ తమ ఎక్స్ మాధ్యమంలో తెలిపారు. ఇక్కడి కార్పెంటర్లు కష్టపడి పనిచేసే ఆరితేరిన శిల్పులు. చెక్కను మలిచి అందాలను రంగరించే వారు. నాణ్యత మన్నిక అందం చందం అంతా వారి సృష్టిలో అంతర్భాగం అని ప్రశంసించారు. వారి నుంచి తాను నేర్చుకున్నది అత్యల్పం నేర్చుకోవల్సింది అనల్పం అని రాహుల్ స్పందించారు. రాహుల్ ఇప్పుడు ఫర్నిచర్ మార్కెట్‌కు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటికీ సాగుతోందని తెలిపింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావడమే రాహుల్ ఆలోచనా విధానం అని పార్టీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News