Wednesday, January 22, 2025

స్వర్ణాలయంలో ఆధ్మాత్మిక సేవల రాహుల్

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ : కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ అమృత్‌సర్‌లోని స్వర్ణాలయానికి సోమవారం వెళ్లారు. సిక్కుల సంప్రదాయాల ప్రకారం తలపై నీలపు వస్త్రం వేసుకుని రాహుల్ స్వర్ణాలయం అంతర్భాగంలో గురుగ్రంథ్ సాహిబ్‌ను ఉంచే ప్రదేశానికి వెళ్లి ప్రార్థనలు జరిపారు. ఆ తరువాత అక్కడి నుంచి అకల్ తక్త్‌కు చేరుకున్నారు. స్వర్ణాలయం సందర్శకులు ఆచారం ప్రకారం నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా భక్తులు వాడిన పాత్రల శుద్ధిజరిపారు. సేవా కార్యక్రమంలో ఆయన ఎక్కువ సేపు ఉంటారని, మంగళవారం ఉదయం జరిగే పల్లకీ సేవలో పాల్గొంటారని వెల్లడైంది. స్వర్ణాలయానికి రాహుల్ గాంధీ రావడం కేవలం వ్యక్తిగతం అని పంజాబ్ పిసిసి అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ట్వీటు వెలువరించారు. ఇది పూర్తిగా ఆధ్మాతిక విషయం అని, ఈ పర్యటన గోప్యతను అంతా గౌరవించాల్సి ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News