Sunday, January 19, 2025

ఝజ్జర్ అఖాడాను సందర్శించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో అఖాడాను సందర్శించి, బజరంగ్ పునియాతో సహా కొంత మంది రెజ్లర్లతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ ఉదయం ఛారా గ్రామంలోని వీరేందర్ అఖాడాకు వచ్చారని, ఆయన ఆ తరువాత పునియాతో సహా రెజ్లర్లతో మాట్లాడారని హర్యానా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. రాహుల్ రెండు గంటల పాటు అఖాడాలో గడిపారు. డబ్లుఎఫ్‌ఐని కమ్ముకున్న వివాదం నేపథ్యంలో రెజ్లర్లతో రాహుల్ భేటీ చోటు చేసుకున్నది. రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత పునియా విలేకరులతో మాట్లాడుతూ, రాహుల్ అఖాడాలో రెజ్లర్ల దైనందిన కార్యకలాపాలు చూశారని, వారితో ముచ్చటించారని తెలియజేశారు.

రాహుల్‌తో సమావేశంలో డబ్లుఎఫ్‌ఐ వివాదం ప్రస్తావనకు వచ్చిందా అన్న ప్రశ్నకు మరొక రెజ్లర్ సమాధానం ఇస్తూ, తాము ఎంతో మానసిక వ్యథ అనుభవిస్తున్నామని ఆయనతో చెప్పామని తెలిపారు. రాహుల్ సందర్శన ‘అప్పటికప్పుడు’ జరిగిందని, అఖాడాలో ఉన్న రెజ్లర్లకు ఆ సంగతి తెలియదని ఆ రెజ్లర్ మరొక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘రాహుల్ ఉదయం 6.15 గంటలకు అఖాడా చేరుకున్నారని, తమ దైనందిన కార్యకలాపాల గురించి అడిగారని, తమ ఎక్సర్‌సైజ్‌లు చూశారని, ఆయన కూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేశారని రెజ్లర్ చెప్పారు. రెజ్లింగ్ గురించి ఆయనకు గల విశేష పరిజ్ఞానానికి తాము సంతసించామని, ఆయనకు కొన్ని పద్ధతులు తెలుసునని రెజ్లర్ చెప్పారు. రాహుల్ తమతో కలసి పాలు, ‘బజ్రే కీ రోటీ’, ‘సాగు’ తీసుకున్నారని రెజ్లర్ తెలిపారు. స్థానికంగా పండించిన కొన్ని కూరగాయలను రాహుల్‌కు అందజేశారు. ఆయన వాటిని తనతో తీసుకువెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News