Monday, December 23, 2024

27 న రాహుల్ పంజాబ్ పర్యటన

- Advertisement -
- Advertisement -

Rahul gandhi visits Punjab on the 27th

 

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈనెల 27 న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మా ప్రియతమ నాయకుడు రాహుల్ ఈ నెల 27న పంజాబ్‌కు వస్తున్నారని ఆయనకు ఘనస్వాగతం పలకడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని సిద్దూ ట్వీట్ చేశారు. రాహుల్ గురువారం ప్రత్యేక విమానంలో పంజాబ్‌కు చేరుకుంటారు. అనంతరం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 117 మంది అభ్యర్థులతో కలిసి రోడ్డు మార్గాన వెళ్లి అమృత్‌సర్‌లోని శ్రీహర్‌మందిర్ సాహిబ్‌ను సందర్శిస్తారు. ఆ తరువాత శ్రీదుర్గాయ మందిర్‌ను, భగవాన్ వాల్మీకి తీరధ్ స్థల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత రోడ్డు మార్గాన జలందర్‌కు వెళ్లి అక్కడ వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తారు. తరువాత జలంధర్ ఎయిర్‌పోర్టుకు, అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News