Friday, November 22, 2024

పాస్‌పోర్టు కోసం కోర్టుకెళ్లిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రధాని “మోడీ ఇంటిపేరు” వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడడంతో రాహుల్ తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఇక ఎంపీ కోటాలో ఇచ్చిన దౌత్య పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనున్నది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్నందున పాస్‌పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఒసి) ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 31నుంచి పదిరోజుల పాటు రాహుల్ అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 4న న్యూయార్క్ లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతోపాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News