Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం : భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సమాధికి నివాళి

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం తథ్యమని తెలంగాణ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతం కావడంతో ప్రత్యేక బస్సులో ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లు గెలుస్తామని ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. డా. వైఎస్ రాజశేఖర రెడ్డి  దార్శనికత, ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళాలని కోరారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనన్నారు. కడప జిల్లా వెల్లంపల్లి వద్ద భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News