Sunday, January 19, 2025

రాసిపెట్టుకోండి.. జూన్ 9న రాహుల్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాసిపెట్టుకోండి…. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండోరోజూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి కేరళలోని వాయనాడ్‌లో రైతుల సమావేశంలో మాట్లాడుతూ కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు తెలివైన వారన్నారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ, కేరళ అభివృద్ధి కాలేదన్నారు. కేరళ సిఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారన్నారు. బంగారం స్మగ్లింగ్‌లో సిఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సిఎం విజయన్‌పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా ఆయనపై మోడీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News