Monday, December 23, 2024

శనివారం అధికారిక బంగళా ఖాలీ చేయనున్న రాహుల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 22న(శనివారం) తన అధికారిక బంగళాను ఖాలీ చేయనున్నారు.
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు పుర్ణేష్ మోడీ అనే బిజెపి ఎమ్మెల్యే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన దరిమిలా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన తన అధికారిక నివాసం 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీని నెలరోజుల్లో ఖాళీ చేయాలని పార్లమెంట్ సచివాలయం మార్చి 27న ఆదేశించింది. 2005 నుంచి ఈ బంగళాలో రాహుల్ గాంధీ నివసిస్తున్నారు. తనకు విధించిన కారాగార శిక్షపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను సూరత్ కోర్టు తోసిపుచ్చడంతో ఇక హైకోర్టును ఆశ్రయించాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.

Also Read: సమంత ఒంటిపైన చెరిగిపోని పచ్చబొట్టు నాగచైతన్యదే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News