Sunday, December 22, 2024

ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్న రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ప్రచారంలో కాంగ్రెస్ నేతలు జోరు పెంచుతున్నారు. అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అలంపూర్ ఎర్రవల్లి క్రాస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

నాగర్ కర్నూల్ ఎంపి అభ్యర్థి మల్లు రవి విజయం కోసం రాహుల్ గాంధీ ఈ ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శులు తదితరులు పాల్గొననున్నారు. ఈనెల 06, 07వ తేదీల్లో ప్రియాంకగాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News