- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన అజయ్ రాయ్ ప్రకటించారు.
శుక్రవారం నాడు ఆయన లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంగక గాంధీ వారణాసి నుంచి లేదా మరే ఇతర స్థానం నుంచి పోటీచేయాలని భావించినా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆమె గెలుపుకోసం శ్రమిస్తారని చెప్పారు. ప్రస్తుం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో అమేథీ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో ీ స్థానంలో రాహుల్ ోటమి పాలయ్యారు. స్మృతి ఇరాని బిజెపి తరఫున పోటీ చేసి ఇక్కడి నుంచే గెలుపొందారు.
- Advertisement -