Thursday, July 4, 2024

లోక్ సభ ప్రసంగంలో తొలగించిన అంశాలని పునరుద్ధరించండి

- Advertisement -
- Advertisement -

స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడిగా తాను లోక్ సభలో చేసిన ప్రసంగం నుంచి తొలగించిన అంశాలను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం లేఖ రాశారు. స్పీకర్ ఏరికోరి కొన్ని అంశాలను కావాలనే తొలగించారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు.

‘‘ నేను మీ దృష్టికి అనురాగ్ ఠాకుర్ ప్రసంగం విషయాన్ని కూడా తీసుకు రావాలనుకుంటున్నాను. ఆయన ప్రసంగం అంతా ఆరోపణలతో కూడుకున్నవి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఒకే ఒక పదాన్ని తొలగించినట్లు ఆయన చెప్పారు. కానీ ఏరికోరి అనేక అంశాలు తొలగించారు’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.

స్పీకర్ చర్య లోక్ సభ నియమాలకు వ్యతిరేకంగా ఉందని కూడా రాయ్ బరేలి ఎంపీ అయిన రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ రూల్ 380 కింద మీరు తొలగించిన అంశాలు రావు, ఇక సభలోని ప్రతి సభ్యుడికి తన వాదనను వినిపించే హక్కు రాజ్యాంగం లోని ఆర్టికల్ 105(1) కల్పించింది. ప్రజల అంశాలను సభలో లేవనెత్తే హక్కు ప్రతి సభ్యుడికి ఉంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఇంకా ‘‘స్పీకర్ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకనే నా ప్రసంగం నుంచి తొలగించిన అంశాలను పునరుద్ధరించాలి’’ అన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నీట్ పరీక్ష అక్రమాలు, బిజెపి, మోడీ,ఆర్ఎస్ఎస్, హిందూ మతం, అగ్నివీర్ వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ‘జై సంవిధాన్’ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు కేంద్ర మంత్రులు, ఎంపీలు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News