Monday, January 20, 2025

రాహూల్ యాత్ర అందరిది.. తరలిరండి

- Advertisement -
- Advertisement -

భారత్ జోడో యాత్ర 2పై కాంగ్రెస్ పిలుపు

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ నేత ఈ న్యాయ్ యాత్రను ముంబై నుంచి మణిపూర్ వరకూ సాగిస్తారు ప్రజలు, అన్ని సామాజిక సంస్థలు, వివిధ ఉద్యమ సంఘాలు ఈ యాత్రలో భారీ ఎత్తున పాల్గొనాలని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం పిలుపు నిచ్చారు.

సామాజిక న్యాయం, బాబాసాహెబ్ విరచిత రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించే శక్తులన్నింటికీ ఈ యాత్ర స్వాగతం పలుకుతోందని జైరాం రమేష్ చెప్పారు. దేశంలో ఇప్పుడు వ్యవస్థల అణచివేతలు, వాటిని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకోవడం జరుగుతోంది. రాజ్యాంగ ప్రామాణిక విలువలను ఖూనీ చేస్తున్నారు. జనం న్యాయం కోసం ప్రశ్నిస్తున్నారు. ఈ నినాదాన్ని తీసుకునే రాహుల్ గాంధీ తిరిగి మరోసారి జనంలోకి వస్తున్నారు. న్యాయం కోసం జనం తరఫున నినదిస్తున్నారని , ఇందులో అంతా భాగస్వామ్యం కావల్సి ఉందని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

ఆర్థిక, సామాజిక , రాజకీయ న్యాయం అందరికీ అందాలనే అంతర్లీన ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఈ కార్యక్రమం తలపెట్టినట్లు కాంగ్రెస్ నేత రమేష్ వివరించారు. కోట్లాది జనం తరలిరావాలి. వేలాది సంస్థలు పాల్గొనవచ్చు, పలు సంఘాలు స్పందించవచ్చు అని ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇప్పటికే బిజెపి మోడీ సారధ్యంలో పలు విశేష కార్యక్రమాలతో జనంలోకి వెళ్లడం, ప్రత్యేకించి సెంటిమెంట్లను రగిలించేందుకు యత్నిస్తున్న దశలో ఈ జోడో 0.2 యాత్రను కాంగ్రెస్ చేపట్టింది. ఎన్నికలకు ముందు బిజెపికి కౌంటర్‌గా దీనిని విశ్లేషించాల్సి వస్తోందని రాజకీయ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News