Friday, December 27, 2024

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఎప్పుడంటే…

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

హైదరాబాద్:  వచ్చే స్వార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్  పార్టీ యువనేత రాహుల్ గాంధీ  వ్యూహరచన చేశారు. దేశమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలన్న లక్ష్యంగా ‘భారత్ జోడో’ పేరుతో సుదీర్థ పాదయాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 7వ తేదీన ఆయన ఈ పాదయాత్ర మొదలుపెడతారు. ఇదిలావుండగా  తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ‘భారత్ జోడో యాత్ర’కు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం కాగా అందులో కొన్ని మార్పులు చేశారు. అక్టోబర్ 24వ తేదీ రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ప్రవేశించి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట , శంకరం పేట, మద్నూర్ గుండా సాగుతోంది. రాహుల్ గాంధీ తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News