Monday, December 23, 2024

నిరుద్యోగం, ధరల పెరుగుదలే దీనికి కారణం

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఘటనపై రాహుల్ గాంధీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో డిసెంబర్ 13న జరిగిన భద్రతా వైఫల్యాకి ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. శనివారం న్యూఢిల్లీలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ విధానాల కారణంగా దేశంలో యువతకు ఉద్యోగాలు దొరకడం లేదని, ఈ కారణంగానే పార్లమెంట్‌లో భద్రతా వవైఫల్య ఘటన చోటుచేసుకుందని అన్నారు. అసలు ఈ ఘనట ఎందుకుజరిగిందని ఆయన ప్రశ్నించారు. దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగం. దేశమంతా దీనిపై రగిలిపోతోంది. ప్రధాని మోడీ విధానాల కారణంగానే దేశంలోయువతకు ఉద్యోగాలు లభించడం లేదు అని రాజీవ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News