Monday, January 20, 2025

రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఎత్తివేయాలి : అఖిలపక్షం డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేయాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియార్ నేత వి. హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం సోఉమాజిగూద ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్‌పై అనర్హత వేటును అన్ని రాజకీయ పార్టీలు నేతలు ఖండించారు. ఒక బిసి ప్రధానిగా నరేంద్ర మోడి బిసిలకు ఎలాంటి న్యాయం చేయలేకపోయాడని, మోడి అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా హనుమంతరావు అన్నారు.

బిజెపి పాలనకు ప్రజలు స్వస్తి చెప్తారని ఆయనన్నారు. యుపిఎ ప్రభుత్వంలో బిసిలకు ఐఐటి, ఐఎంఎం లలో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. సమావేశంలో టిజెఎస్ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, సిపిఐ మాజీ ఎంపి అజీజ్ పాషా, ఆమ్ ఆద్మీ పార్టీ కొ ఆర్డినేటర్ రాము గౌడ్, కాండ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్‌ఎల్‌సి రాములు నాయక్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు ఇందిరా శోభన్, జెబి సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, పిడిఎస్ నాగేశ్వరరావు, ఆర్. లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్, రామ్ శెట్టి నరేందర్, రాపోలు జె.ప్రకాష్, శివకుమార్, మెట్టు సాయి, మోతె రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News