Thursday, December 19, 2024

రాహుల్  గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ఈసి

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను తనిఖీ చేశారు ఎన్నికల అధికారులు. అమరావతిలో శనివారం మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్ దిగగానే అధికారులు ఆయన వెంట తెచ్చుకున్న బ్యాగులను తనిఖీ చేశారు. హెలికాప్టరును కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల వేళ ఇలాంటి తనిఖీలు పరిపాటేనని ఈసి స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 20న జరుగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడవుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News