Saturday, November 2, 2024

గరిట తిప్పిన రాహుల్!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నలభీముడి అవతారం ఎత్తారు. గ్రామస్తుల సరసన నేల మీద కూర్చుని తాను స్వయంగా వండిన రైతా(పెరుగు చట్నీ)ను కలాన్ బిర్యానీ(పుట్టగొడుగుల బిర్యానీ)లో నంజుకుంటూ రాహుల్ ఆస్వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలి తన తమిళనాడు పర్యటనలో రాహుల్ గాంధీ స్వయంగా తాను రైతాను తయారు చేయడమే కాక గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. ఈ వీడియోను విలేజ్ కుకింగ్ చానల్ యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే దాదాపు 31.24 లక్షల మంది ఈ వీడియోను వీక్షించడం విశేషం. రైతాను తయారు చేసే ప్రక్రియను రాహుల్ వివరించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. తరిగిన ఉల్లిపాయలను పెరుగులో కలిపిన తర్వాత దాని రుచి చూసి రాహుల్ తన వంట ప్రావీణ్యానికి తానే మురిసిపోయారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలసి నేల మీద కూర్చుని, దక్షిణాది పద్ధతిలో అరటి ఆకులో నీళ్లు చల్లుకుని బిర్యానీ ఆరగించారు. బిర్యానీ వండిన వారిని తమిళంలోనే రొంబ నల్ల ఇరుక్కు(చాలా బాగుంది) అంటూ రాహుల్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వారిని మీ లక్షమేమిటని రాహుల్ ప్రశ్నించగా అమెరికా వెళ్లడమేనని ఒక వ్యక్తి సమాధానమివ్వడంతో తన ప్రియ మిత్రుడు శామ్ పిట్రోడాతో మాట్లాడి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని రాహుల్ భరోసా ఇచ్చారు. రాహుల్ వెంట కరూర్ కాంగ్రెస్ ఎంపి ఎస్ జోతిమణి, కాంగ్రెస్ తమిళనాడు ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు ఉన్నారు.

Rahul Gandhi’s Kalaan Biryani viral video

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News