Friday, December 20, 2024

సిరిసిల్లలో రాహుల్‌ గాంధీ సభ వాయిదా..

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా పడింది. ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన సభ చేనపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర పిసిసి అందుకు రాహుల్‌గాంధీని ఆహ్వానించింది. అయితే తాజాగా ఈ సభను వాయిదా వేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇడి విచారణ, పార్లమెంట్ సమావేశాలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరైన సమావేశంలో సిరిసిల్లలో రాహుల్ సభను వాయిదా వేయాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. సిరిసిల్లలో రాహుల్‌గాంధీ పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను కాంగ్రెస్ పార్టీ త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహిస్తే, రాహుల్‌గాంధీ, రాష్ట్ర ఇంఛార్జి, పార్టీ ఎంపి మాణికం ఠాగూర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు ఎంపీలు హాజరు కావాల్సి ఉంటుందని సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఐదుగురు ఎంపిలను బహిరంగ సభకు పంపడం పార్టీకి కష్టమేనని ఆయన అన్నారు. ఇక, ఆగస్టు 2న సిరిసిల్లలో రాహుల్‌గాంధీ సభ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం చేపట్టబోతున్న కార్యాచరణను డిక్లరేషన్ రూపంలో రాహుల్ గాంధీ ప్రకటిస్తారని తెలిపారు.

Rahul Gandhi’s Sircilla Sabha Postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News