Thursday, January 23, 2025

కర్నాటకకు రాహుల్ గాంధీ!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటకలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించనున్నారు. రాహుల్ గాంధీపై లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడ్డాక కర్నాటకను ఆయన తొలిసారి సందర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆదివారం హెలికాప్టర్‌లో మొదట బెంగళూరుకు, తర్వాత కోలార్‌కు చేరుకోనున్నారు.

కోలార్‌లో కాంగ్రెస్ ‘జై భారత్’ ర్యాలీలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. కోలార్‌లో తన ప్రసంగం తర్వాత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ద్వారా తిరిగి బెంగళూరు చేరుకుంటారు. సాయంత్రం ఆయన వీధి వ్యాపారులు, పారిశుద్ధ కార్మికులతో ‘పౌరకార్మిక’ కార్యక్రమం ద్వారా మాటామంతీ నెరుపుతారు. ఆ తర్వాత కొత్తగా కట్టిన ఇందిరా గాంధీ భవన్ ఆఫీసు, 750 మంది కూర్చోగల ఆడిటోరియంను ప్రారంభిస్తారు. రాత్రి ఆయన బెంగళూరులోని హోటల్‌లో బసచేసి సోమవారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బీదర్ జిల్లాలోని భాల్కి వెళ్లి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భాల్కి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖాంద్రే పోటీచేస్తున్నారు. రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు, తర్వాత ఢిల్లీకి వెళతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News