Wednesday, January 22, 2025

రాహుల్ కారుపై దాడి బెంగాల్‌లో కాదు, బీహార్‌లో : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

బెహ్రాంపోర్ (పశ్చిమబెంగాల్ ): న్యాయయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారుపై దాడి జరిగింది తమ రాష్ట్రంలో కాదని, బీహార్ లోనని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. దాడి జరగడాన్ని ఆమె ఖండించారు. రాహుల్ కారు అప్పటికే పగిలిన అద్దం తోనే తమ రాష్ట్రం లోకి ప్రవేశించిందని, ఆమె వివరించారు.

రాహుల్ కారుపై రాళ్ల దాడి జరిగిందని తనకు సమాచారం అందిందని, అసలు ఏం జరిగిందో వాస్తవాలను పరిశీలించగా, ఆ సంఘటన బీహార్ లోని కటిహార్‌లో జరిగినట్టు బయటపడిందని , ఇదొక డ్రామా తప్ప మరేం కాదని మమత వివరించారు. ప్రజాపంపిణీ కార్యక్రమంలో మమత మాట్లాడారు. ఈ సంఘటన బహుశా బీహార్ ప్రజల ఆగ్రహం వల్ల జరిగి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ విపక్షకూటమి ‘ఇండియా’ నుంచి వైదొలగి బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డిఎ లోకి తిరిగి చేరడం ఈ సంఘటన నేపథ్యం కావచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News