Sunday, January 19, 2025

రాహుల్ గాంధీకి బెయిల్

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అప్పటి బిజేపి అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఓ హత్యకేసులో నిందితుడిని బిజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తించాయి.

రాహుల్ గాంధీపై చర్య తీసుకోవలసిందిగా కోరుతూ బిజేపీ నాయకుడు విజయ్ మిశ్రా కేసు దాఖలు చేశారు. దీనిపై గతంలో పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినా రాహుల్ గాంధీ స్పందించలేదు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన కోర్టుకు హాజరు కాగా, బెయిల్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News