Monday, December 23, 2024

రాహుల్ ఎన్నికల హిందువు : బిజెపి నేత తేజీందర్ పాల్ సింగ్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

BJP's Tajinder Bagga calls Rahul Gandhi

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ప్రముఖ హర్‌కీ పౌరీఘాట్‌లో గంగా హారతి ఇచ్చిన క్రమంలో కాషాయ పార్టీ నేత ఆయనపై వ్యంగ్యోక్తులు వేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాహుల్ హిందువుగా మారతారని, బీజేపీ నేత తేజీందర్ పాల్‌సింగ్ బగ్గా ఎద్దేవా చేశారు. రాహుల్ చునావి హిందూ కాబట్టే పూజారి ఆయనకు సూచనలు చేయాల్సి వచ్చిందని గంగాహారతి సందర్భంగా రాహుల్‌కు సలహాలిస్తున్న పూజారి వీడియోను బగ్గా షేర్ చేశారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ప్రార్థిస్తూ గంగానదికి ప్రణమిల్లానని రాహుల్ మూడు వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గతంలో యూపీ సిఎం యోగి ఆదిత్యానాధ్ కూడా రాహుల్‌పై ఇదే తరహా విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News