Monday, December 23, 2024

కమల్ హాసన్‌కు రాహుల్ వినూత్న కానుక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బహుభాషా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవల న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు భారత్ జోడో యాత్ర సాగిస్తున్న రాహుల్‌తో కమల్ చర్చలు జరిపారు. వర్తమాన రాజకీయాలు, భారతీయ సమాజం, వృత్తిపరమైన జీవితాల గురించి వారి చర్చ సాగింది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వీడియో రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ అయింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కమల్‌కు ఒక వినూత్న కానుకను అందచేశారు. దీనికి సంబంధించి రాహుల్ వివరిస్తూ.. నా సోదరి ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ మంచి ఫోటోగ్రాఫర్. అతను కొన్ని అద్భుతమైన ఫోటోలు తీశాడు.

Rahul is an gift to Kamal Haasan

నా మిత్రుడు కమల్ హాసన్‌కు ఒక బహుమతి ఇవ్వాలి.. కొన్ని మంచి ఫోటోలు కావాలని చెప్పాను. అతను నీకోసం ఇచ్చిన ఫోటో ఏమిటో తెలుసా అంటూ కమల్‌ను రాహుల్ ప్రశ్నించారు. కమల్ తెలియదని జవాబు ఇచ్చారు. అదేమిటో చూపిస్తానంటూ కవర్ వేసిన ఒక ఫోటో వద్దకు రాహుల్ కమల్‌ను తీసుకెళారు. రాహుల్ కవర్ తీయడంతో అక్కడ నీరు తాగుతున్న ఒక పులి చిత్రం దర్శనమిచ్చింది. ఆ ఫోటోను ప్రత్యేకంగా కమల్‌కు ఇవ్వడానికి గల కారణాన్ని రాహుల్ చెబుతూ.. జీవితం పట్ల మీ దృక్పథాన్ని ఈ చిత్రం చెబుతుంది.. మీరు గొప్ప భారతీయుడే కాక గొప్ప పోరాట యోధులు అన్నది వాస్తవం అంటూ రాహుల్ వివరించారు.

నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమల్ హాసన్ 2018లో మక్కళ్ నీది మయ్యమ్ పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల ఆయన నటించిన విక్రమ్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇటీవల ఢిల్లీని చేరుకున్నపుడు కమల్ అందులో పాల్గొన్నారు. తాను రాహుల్‌ను కలుసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. నేను ఇక్కడ ఎందుకు ఉన్నానని చాలామంది నన్ను అడిగారు. దీనికి నేను ఇచ్చే సమాధానం ఒక్కటే.. ముందుగా నేను భారతీయుడిని. నా త్రండి కాంగ్రెస్‌వాది. నా సిద్ధాంతాలు వేరే కాబట్టి సొంత రాజకీయ పార్టీని స్థాపించాను. దేశం విషయానికి వస్తే నేనే కాదు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తన సిద్ధాంతాలను పక్కనపెట్టాల్సిందే. నేను కూడా నా సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇక్కడకు వచ్చాను అంటూ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News