Friday, December 20, 2024

మోడీ మౌనం దేశానికి ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Rahul is concerned about China's intrusion

చైనా చొరబాటుపై రాహుల్ ఆందోళన

న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి పెరుగుతున్న చైనా చొరబాటు, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దేశానికి తీవ్ర ప్రమాదకరమని కాంగ్రెస్ అగ్రనేత్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గురించి ఐదు నిజాలు అంటూ ఆయన సోమవారం ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. చైనా అంటే భయపడే మోడీ నిజాన్ని దాయడమేగాక తన సొంత ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి 5 నిజాలు. 1.చైనా అంటే ఆయనకు భయం. 2. ప్రజల నుంచి నిజాలను దాస్తున్నారు. 3. తన వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 4. సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. 5. దేశ భద్రతతో చెలగాటమాడుతున్నారు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News